నిమ్మగడ్డ కేసులో నో స్టే … సుప్రీం తీర్పు..

ఎస్‌ఈసీగా ‘నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌’ను తొల‌గించాల‌న్న వైకాపా ప్రభుత్వ నిర్ణయాన్ని ‘సుప్రీంకోర్టు’ తప్పుపట్టింది. ఇప్పటికే ఈ కేసులో ‘నిమ్మగడ్డ’నే  ఎస్ఇసీగా కొనసాగించాల‌ని తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ‘జగన్‌’ ప్రభుత్వం ‘సుప్రీం’ తలుపులు తట్టింది. అయితే సుప్రీంకోర్టులోనూ ఇదే తీర్పు వచ్చింది. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో ప్రతివాదుల‌కు నోటీసు జారీ చేసిన న్యాయస్థానం రెండు వారాల్లో సమాధానం చెప్పాల‌ని ఆదేశించింది. రాజ్యాంగ వ్యవస్థల‌తో ఆటలు తగవని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎస్‌ఈసీ పదవీ కాలం కుదింపు ఆర్డినెన్స్‌ వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యాలు సంతృప్తికరంగా లేవని అత్యున్నత న్యాయస్థానం సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడిరది. ఇలాంటి ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే ప్రశ్నించారు. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్న వారితో ఆటలాడుకోద్దని సీజేఐ వ్యాఖ్యానించారు. కాగా ఇప్పటికే హైకోర్టులో ‘జగన్‌’ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల‌ను హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టగా, తాజాగా సుప్రీంకోర్టు కూడా ‘జగన్‌’ ప్రభుత్వ నిర్ణయాల‌ను తప్పుపడుతోంది. ఇటీవల‌ ప్రభుత్వం భవనాల‌కు రంగు వేసిన విషయంలోనూ ‘సుప్రీం’ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఇప్పుడు ఎస్‌ఈసీ విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయాల‌ను ఆక్షేపించింది. వరుసగా కోర్టుల‌ నుంచి ఎదురుదెబ్బలు తింటోన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాల‌ విషయంలో పునసమీక్షించుకుంటుందో లేదో చూడాలి మరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *