ప్రభుత్వం ‘ఇసుక’ సమస్యతో సతమతమవుతోందా!!

    తాము అందరికీ ఆదర్శవంతమైన ఇసుక పాలసీని తెస్తామని ప్రకటించింది. ఇక అప్పటి నుంచి ఇసుక సమస్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది కానీ, ఎక్కడా తగ్గలేదు. గత ప్రభుత్వాని కన్నా ఆదర్శమైన పాలసీని తెచ్చామని ప్రభుత్వం ప్రకటించినా ఈ పాలసీ వల్ల పొయ్యిలో నుంచి పెనంపై పడిన విధంగా రాష్ట్ర ప్రజల పరిస్థితి తయారైంది. ఇదేదో ప్రతిపక్ష, మీడియా వర్గాలు ఆరోపిస్తున్నది కాదు. స్వంత పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులే చెబుతున్న మాట. రాష్ట్ర వ్యాప్తంగా గుప్పెడు ఇసుక దొరకడం లేదని స్వయానా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా వల్ల ప్రజలల్లో చెడ్డపేరు వస్తోందని వారు గగ్గోలు పెడుతున్నారు. ఏ సమస్యకీ పెద్దగా స్పందించినట్లు కనిపించని ప్రభుత్వం ఇసుక సమస్య తీవ్రత గమనించి దీనిపై చర్యలు తీసుకుంటోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల ఇసుక సమస్య తీరుతుందా..? అంటే లేదనే సమాధానం వస్తోంది.

ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షల్లో ఇసుకపై నూతన విధానాలను ప్రకటించారు. దాని ప్రకారం ఇక నుంచి గ్రామాల్లో ఇసుక కావాల్సిన వారు గ్రామ కార్యదర్శికి ధరఖాస్తు చేసుకోవాలి. గ్రామ కార్యదర్శి ఓకే అంటేనే ఎడ్లబండ్లలో ఇసుకను తీసుకెళ్లాని నిబంధను పెట్టారు. అయితే ఈ తీసుకెళ్లిన ఇసుకను స్వంత అవసరాలకు ఉపయోగించు కోవాలని, అమ్ముకోరాదని షరతు విధించారు. ప్రభుత్వ ఉద్దేశ్యం బాగానే ఉన్నా..దీని వల్ల స్థానిక నేతలు, గ్రామ కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చి యధేచ్చగా ఇసుకను తరలించుకుపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతే కాకుండా గ్రామాల్లో ఉన్న పార్టీ వల్ల తమకు నచ్చిన వారికి ఇసుక ఇచ్చి నచ్చని వారిని వేధించే పరిస్థితి నెలకొని ఉంది. కాగా ఇప్పటి వరకు బల్క్‌లో ఆర్డర్‌ ఇచ్చిన వారు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. బల్క్‌లో ఇసుక కావాల్సిన వారు జెసికి ధరఖాస్తు చేసుకోవాలి. దీని వల్ల కాలయాపన జరుగుతుందనే భావన వారిలో ఉంది. మొత్తం మీద గతంలో ఉన్న ఇసుక పాలసీని మార్చడం వల్ల అటు పేదలు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై భారీగా విమర్శలు వస్తున్నాయి. స్వంత పార్టీకి చెందిన నేతలే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూండడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా తయారైంది. ఎన్నో సంక్షేమ పథకాలను అము చేస్తున్నామని చెబుతోన్న ప్రభుత్వం ‘ఇసుక’ను చూసి భయపడుతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *