నివేశన స్దలాలకు నియమాలు

నివేశన స్దలాలకు నియమాలు
====================
గ్రామంలో ఇంటి నివేశన స్థలం లేని నిరుపేదలను ఈ క్రింది విధంగా గుర్తించాలి.
1.white రేషన్ కార్డ్ ఉండాలి
2.ఆధార్ కార్డ్ ఉండాలి
3.ఓటర్ కార్డ్ ఆ గ్రామంలోనే ఉండాలి.
4.స్వంత ఇంటి స్థలం ఉండరాదు.
5.స్వంత ఇల్లు ఉండరాదు.
6.ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి.
7.కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండరాదు.
8.మాగాణి 2.50, మెట్ట 5 ఎకరాల లోపు ఉండవచ్చు.
9.గతంలో ప్రభుత్వం వారు ఇంటి స్థలం మంజూరు చేసి ఉండరాదు.
10.గతంలో ప్రభుత్వం వారు Housing లోన్ మంజూరు చేసి ఉండరాదు.
11.గతంలో ప్రభుత్వం వారు LA లో లబ్దిదారుడై ఉండరాదు.
12.గతంలో ప్రభుత్వం నుండి పొజిషన్ సర్టిఫికెట్ పొంది ఉండరాదు.
13.లబ్దిదారుని తండ్రి పేరు మీద స్థలం ఉన్నచో లబ్దిదారుడు ఒక్కడే వారసుడు ఉన్నచో తదనంతరం సదరు ఇల్లు గాని ఇంటి స్థలం గాని అతనికే చెందును. కాబట్టి లబ్ది దారునికి ఇంటి స్థలం ఇవ్వవలసిన అవసరం లేదు
14.ఒక కుటుంబం నకు సుమారు 5 సెంట్ల ఇంటి స్థలం కలిగి ఉండి ఆ కుటుంబం లో ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నచో అటువంటి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరుకు పరిగణలోకి తీసుకొనరాదు.
15.ఇతరులకు కేటాయించిన ఇంటి స్థలంలను కొని అందులో నివాసం ఉంటున్నవారిని పరిగణనలోకి తీసుకొనరాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *