టీటీడీ భూముల వివాదంపై స్వరూపానందేంద్ర

టీటీడీ భూముల వివాదంపై స్వరూపానందేంద్ర సూచనలు
విశాఖ: టీటీడీ భూముల వివాదంపై ఏపీ ప్రభుత్వానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి కీలక సూచనలు చేశారు. టీటీడీ భూముల విక్రయంపై ఏపీ ప్రభుత్వ పెద్దలతో పాటు టీటీడీ చైర్మన్, ఈవోలతో స్వరూపానందేంద్ర స్వామి కీలక మంతనాలు జరిపారు. టీటీడీ వ్యవహారంలో వివాదాలకు తావు ఇవ్వకుండా నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి స్వరూపానంద స్వామి సూచించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు ముడిపడి ఉంటుందని, వారి మనోభావాలను గౌరవించే విధంగా టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకోవడం మంచిదని స్వరూపానంద స్వామి టీటీడీ పాలక మండలికి స్పష్టం చేశారు. టీటీడీ భూముల విక్రయం విషయంలో వివాదాలకు తెరదించే విధంగా నిర్ణయం తీసుకోవడమే మేలని అభిప్రాయపడిన స్వరూపానందేంద్ర… కరోనా మహమ్మారి కారణంగా 3 నెలల తర్వాత మళ్లీ శ్రీవారి ఆలయం తెరుచుకుంటుందని భక్తులు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వానికి స్వరూపానంద స్వామి సూచనలు ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *