విశాఖపట్నానికి చంద్రబాబు

టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ‘విశాఖపట్నం’ పర్యటనకు రాష్ట్రం ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు రోజుల‌ క్రితం ఆయన హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాకు రావడానికి రాష్ట్ర డీజీపీని అనుమతి కోరారు. దీనికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఆయన పర్యటనకు అనుమతి ఇస్తూ ఆదేశాల‌ను జారీ చేసింది. దీంతో రేపు ‘విశాఖపట్నానికి చంద్రబాబు రాకకు మార్గం సుగగమైంది. రేపు ఉదయం 10గంటల‌కు ఆయన హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు ప్లయిట్‌లో రావడానికి ప్లాన్‌ చేసుకున్నారు. కానీ..ఈలోపే ప్లయిట్స్‌ రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ‘చంద్రబాబు’ ‘విశాఖ’ పర్యటన ఉంటుందా..? లేదా అనే అనుమానాలు పార్టీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్నాయి. విమానాలు లేకపోవడంతో ఆయన విశాఖకు రావాలంటే ఇక రోడ్డు మార్గానే రావాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు దాదాపు 620 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత దూరం ఆయన రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కాగా.. విమానాులురద్దు అయినా సరే…రోడ్డు మార్గాన ఆయన రావడానికి సిద్ధపడుతున్నారని తెలుస్తోంది. రేపు ఉదయాన్నే ఆయన హైదరాబాద్‌లో బయుదేరి మధ్యాహ్నానికి ‘విశాఖ’కు చేరుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘చంద్రబాబు’తో పాటు ఆయన తనయుడు ‘లోకేష్‌’ కూడా ‘విశాఖ’కు రానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *