శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని 16కేజీల పసిడి చీర…!

పుణె: దసరా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా ముగిశాయి. తొమ్మిదిరోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా విజయదశమి నాడు పుణెలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని 16కేజీల పసిడి చీరతో అలంకరించారు. ఏడాదికి రెండు సార్లు మాత్రమే అమ్మవారికి ఈవిధంగా బంగారు చీరను అలంకరిస్తారు. విజయదశమి, లక్ష్మీపూజ రోజున మాత్రమే మహాలక్ష్మీ దేవి పసిడి చీరలో కాంతులీనుతారు. కనకపు చీరలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వద్ద క్యూ కట్టారు. దక్షిణాదికి చెందిన కళాకారులు ఎనిమిదేళ్ల క్రితం దీన్ని రూపొందించారు. 6 నెలలపాటు శ్రమించి ఈ పసిడి చీరను తయారు చేశారు. అప్పటి నుంచి ఏటా రెండు సార్లు అమ్మవారికి చీరను అలంకరిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *