జ‌న‌సేన అధినేత‌ని క‌ల‌సిన ఆప్తా ఎగ్జిక్యూటివ్ బాడీ

2020 ఆప్తా నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్‌కి ఆహ్వానం.సుముక‌త వ్య‌క్తం చేసిన శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు.22వ తానా మ‌హాస‌భ‌ల కోసం అమెరికా వ‌చ్చిన జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారిని ఆప్తా(APTA) ఎగ్జిక్యూటివ్ బాడీ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసింది. శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారిని క‌లిసిన వారిలో APTA ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ శ్రీ నటరాజు ఇల్లూరి గారు, బోర్డు చైర్ శ్రీ కిరణ్ పల్లా గారు, బోర్డు డైరెక్టర్ శ్రీ శ్రీధర్ నిశంకరరరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీకాంత్ మన్నెం గారు, ఇండియా ఆపరేషన్స్ చైర్ శ్రీ మధు దాసరి గారు, కాపిటల్ రీజియన్ శ్రీ RVP సునీల్ నందముడి గారు, పూర్వ ప్రెసిడెంట్ శ్రీ వెంకట్ చలమలశెట్టి గారు, పూర్వ బోర్డు డైరెక్టర్ శ్రీ విజయ్ గుడిసేవ గారు, పూర్వ బిజినెస్ ఫోరమ్ వైస్ చైర్మ‌న్ శ్రీ వెంకట రత్నం సూడ గారు, ATSAP చైర్ శ్రీ మనోజ్ బడే గారు త‌దిత‌రులు ఉన్నారు. మొద‌ట శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారికి త‌మ‌ను తాము ప‌రిచ‌యం చేసుకున్న ఆప్తా స‌భ్యులు, ఆయ‌న్ను స‌న్మానించారు. అనంత‌రం APTA పుట్టుక‌, స్థాపించడం వెనుక ఉన్న కార‌ణాలు, పుట్టుక వెనుక ఉన్న పెద్ద‌ల వివ‌రాలు, ఆప్తా ప‌ది వ‌సంతాల అభివృద్ది ప‌య‌నం, సేవ‌లు, ఆప్తా విజ‌న్ త‌దిత‌ర అంశాల‌ను శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారికి వివ‌రించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆప్త సేవలని మనస్పూర్తి గా మెచ్చుకున్నారు. ఆప్త మరిన్ని సేవలని అందించాలని, మరియు మిగతా తెలుగు సంస్థలతో కలిసికట్టుగా (inclusive) పనిచేయాలని సూచించారు.

ఈ సంద‌ర్బంగా 2020లో జ‌ర‌గ‌బోయే ఆప్త నేష‌న‌ల్ క‌న్వెన్ష‌న్‌కి శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారికి ఆప్తా బృందం ముంద‌స్తు ఆహ్వానం ఇవ్వ‌డం జ‌రిగింది. శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు త‌ప్ప‌క వ‌స్తాన‌ని మాటిచ్చారు.
– ఆప్త మీడియా టీం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *