కొత్త ఇసుక విధానంపై ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష….

అమరావతి: ఇకపై ఏపీఎండీసీ ద్వారా ఇసుకను విక్రయించాలని నిర్ణయం.ప్రస్తుతం లభిస్తున్న రేట్లకన్నా తక్కువ రేట్లకే ఇసుకను అందించాలని సీఎం ఆదేశం.అవినీతి లేకుండా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా, పర్యావరణాన్ని పరక్షించేలా పారదర్శక విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశం.సెప్టెంబరు 5 నుంచి కొత్త ఇసుక విధానం.ఇసుక రీచ్‌ల వద్ద స్టాక్‌యార్డులు, నగరాలు, పట్టణాల్లో అదనపు స్టాక్‌ యార్డులు.ఇసుకరీచ్‌ నుంచి స్టాక్‌యార్డు వద్దకు తరలింపునకు ఒక రశీదు.రీచ్‌లవద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, వే బ్రిడ్జిల ద్వారా లెక్కింపు.స్టాక్‌యార్డునుంచి వినియోగదారుడుకు చేరేంతవరకూ మరొక రశీదు.స్టాక్‌యార్డుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, ఇసుక బయటకు వెళ్లేటప్పుడుకూడా వే బ్రిడ్జి ద్వారా లెక్కింపు.రీచ్‌లవద్ద, స్టాక్‌యార్డుల వద్ద అక్రమాలను అడ్డుకునేందుకే ఈ చర్యలు

ఇసుక తవ్వకాలు, తరలింపులో వాడే వాహనాలకు జీపీఎస్‌ తప్పనిసరి.మాఫియాకు, అక్రమాలకు, అవకతవకలకు, కల్తీలకు దారితీయకుండా పటిష్ట చర్యలు.ఇసుక అక్రమతవ్వకాలు, అక్రమ రవాణాదారులపై కఠిన చర్యలు – వీరిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించాలని ఆదేశం.రెండు నెలల కాలంలో ఇసుక రవాణా వాహనాల గుర్తింపు, వాటికి జీపీఎస్‌ అమరిక, ఇతర సాంకేతిక సన్నాహాలు, వేబ్రిడ్జి, సీసీ కెమెరాల ఏర్పాటు, స్టాక్‌యార్డుల ఏర్పాటు పూర్తిచేయాలన్న ముఖ్యమంత్రి.ఇసుక వినియోగ దారులకోసం ఒక యాప్, వెబ్‌ పోర్టల్‌ను తయారుచేయనున్న ఏపీఎండీసీ.కొత్త ఇసుక విధానం అమల్లోకి వచ్చేంతవరకూ ఇసుక అందించే బాధ్యతను కొనసాగించనున్న కలెక్టర్లు

రెండునెలల్లోగా అదనపు రీచ్‌లను గుర్తింపు, డిమాండ్‌కు తగినట్టుగా ఇసుకను అందించనున్న ఎన్‌ఎండీసీ.ప్రభుత్వానికి, వినియోగదారుడుకు పరస్పరం మేలు జరిగేలా ధరను నిర్ణయించనున్న గనులశాఖ.కోరిన వెంటనే ఇసుకను అందుబాటులో ఉంచేలా రవాణావ్యవస్థను ఏర్పాటు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *